Google

welcome to INDIA YOGA

Indyoga

Monday, March 9, 2009

చాలా రోజుల నుండీ వ్రాద్దామనుకుంటున్నాను....ఈ మద్య వచ్చిన కొత్తపాళి గారి టపా...నిన్ననే వచ్చిన మహేశ్ గారి టపా.... నన్ను ఈ టపాను వ్రాసేలా చేశాయి.నేను పీహెచ్.డీ జాయిన్ అయ్యేంతవరకూ నా జీవితంలో ఎప్పుడూ ఓటమిని నేను చూడలేదు. ఏదో తెలుగు సినిమా డైలాగు కాదు. నిజమే చెప్తున్నాను. నేను చదివిన ప్రతి చోటా మొదటి స్థానంలో నిలిచాను. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా. అందుకే పీహెచ్.డీ ఇలా అర్ధాంతరంగా ఆగిపోవటం అనేది నాకో పెద్ద షాక్. పైగా పీహెచ్.డీ అంటే ఏదో పరీక్షలు వ్రాస్తే వచ్చేసేది కాదు. పేపర్స్ ప్రెజెంట్ చేయటం..guide తో కొంచెం లౌక్యంగా వ్యవహరించటం....ఎవరి దగ్గర నుండైనా సహాయాన్ని కోరటం....ప్రపంచంలో ఎక్కడ మనకి కావల్సిన విషయమున్నా, అది తెలిసిన వ్యక్తులను సంప్రదించటం....ఎన్నో పరిక్షేతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటికి తోడు ఓపికా, సహనం, ఆసక్తి, అంకితభావం చాలా ఎక్కువ పాళ్ళలో ఉండాలి. పీహెచ్.డీ పుణ్యామా అని మొట్టమొదటిసారిగా నేను నాలో లోపాలను గమనించటం ప్రారంభించాను. అయితే వాటిని ఎదుర్కునే ధైర్యాన్ని కూడగట్టుకోవటంలో కొంతవరకూ విఫలమయ్యాను. ఇలాంటి uncertainty అనుభవిస్తున్న సమయంలో పీహెచ్.డీని వదిలే పరిస్థితి వచ్చింది.
కొన్ని నెలల క్రితం నా రీసెర్చ్ వర్క్ ఆపేయాల్సి వచ్చింది. కారణాలు ఎన్నో. ముఖ్యమైన కారణం ఏంటంటే నేను యూ.ఎస్ షిఫ్ట్ అవ్వాల్సి రావటం, వేగంగా పూర్తి చేసే పరిస్థితులు లేకపోవటం, ఇంకొకరిచే రుద్దబడిన ఆలోచనలు నా థీసిస్లో పెట్టాల్సి వస్తుందేమోనన్న భయం....ఇలా ఒకటి కాదు...ఎన్నో. కొంచెం ఆవేశంలోనే వదిలేశాను. నాక్కొంచెం ఆలోచన తక్కువే. ఇన్స్టిట్యూట్ ని పూర్తిగా విడిచిపెట్టేయొద్దు అని సలహా ఇచ్చారు చాలామంది. తరువాత ఏ యూనివర్సిటీలోనూ సీటు దొరక్కపోతే చదువు కొనసాగించొచ్చు అని చెప్పారు. కానీ, నేను ఇన్స్టిట్యూట్ ని పూర్తిగా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేశాను. కొన్నాళ్ళు బాధ.....జీవితం ఆగిపోయిన ఒక ఫీలింగ్. ఎప్పుడూ నేను ఇంటికి పరిమితమైపోతానని అనుకోలేదు. కొద్ది రోజుల్లోనే పిచ్చెక్కినట్లయ్యింది. GRE, TOEFL రాసేద్దామని నిర్ణయించుకున్నాను. ఏదో వ్రాసేసాను. ఇంక statement of purpose కూడా ఏదో మేనేజ్ చేసి రాసేసాను. ఇంక ఒక research paper వ్రాయాలి. నాకో సమస్య ఉంది. ఏదైనా సంపూర్ణంగా తెలియనంత వరకూ confident గా ఫీల్ అవ్వలేను. పైగా ఇంతకుముందు రీసెర్చ్ చేసిన ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్ లోకి చేస్తున్నాను. రీసెర్చ్ పేపర్ లో తప్పొప్పులూ, సలహాలూ, సంప్రదింపులూ చేయటానికి ఎవ్వరూ లేరు. ఎన్నోసార్లు ఓటమి యొక్క ఆలోచనలు నన్ను భయపెట్టినా, శక్తివంచన లేకుండా ప్రయత్నించాలని ప్రగాడంగా నిర్ణయించుకున్నాను. నేను

No comments: